25 మార్చి, 2012

ఇటలీ టూరిస్ట్‌లలో ఒకరికి విముక్తి, చెరలోనే ఎమ్మెల్యే

                                                 www.mulakkada.com ఈ నెల పద్నాలుగో తేదిన కిడ్నాప్‌కు గురైన ఇద్దరు ఇటాలియన్ పర్యాటకులలో ఒకరిని మావోయిస్టులు ఆదివారం విడుదల చేశారు. పదకొండు రోజుల నిర్బంధం అనంతరం క్లాడియో కొలాంజెలోను మావోయిస్టులు విడిచి పెట్టారు. బోసుస్కోపాయిలో అనే ఇటలీ దేశస్థుడు మాత్రం ఇంకా మావోల చెరలోనే ఉన్నారు. బోసుస్కో పంతొమ్మిది ఏళ్లుగా పూరిలో ఉంటూ ఓ టూరిజం ఏజెన్సీని నిర్వహిస్తున్నారు. వీరిద్దరిని పదిరోజుల క్రితం మావోయిస్టులు అరెస్టు చేసి తమ డిమాండ్లు తీర్చాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అయితే మధ్యవర్తులతో ప్రభుత్వం చర్చలు జరుపుతున్న సమయంలోనే మావోయిస్టులు కోరాపుట్ జిల్లా లక్ష్మీపూర్ ఎమ్మెల్యే జికా హికాకాను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. దీంతో చర్చలకు విఘాతం కలిగింది.

ఒడిశా ప్రభుత్వం కూడా ఎమ్మెల్యే కిడ్నాప్‌తో తాము చర్చలకు స్వస్తీ పలుకుతున్నట్లు మావోయిస్టులకు హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఆదివారం ఒక ఇటలీ టూరిస్టును మావోయిస్టులు విడుదల చేశారు. మరో ఇటాలీయన్, శనివారం కిడ్నాప్‌కు గురైన ఎమ్మెల్యే ఇంకా మావోల చెరలోనే ఉన్నట్లు సమాచారం. ఇటలీ దేశస్థుల్లో ఒకరిని విడుదల చేయడంతో ప్రభుత్వానికి కొంత ఊరట లభించింది.