24 మార్చి, 2012

షిరిడీ బాబాకు 40 కేజీల వెండి సింహాసనం

సాయిబాబాకు ముంబైకు చెందిన వ్యాపారి ఒకరు రూ. 27 లక్షల విలువచేసే 40 కేజీల వెండి సింహాసనాన్ని బహూకరించాడు. సాయిబాబా ‘చావిడి’లో దీన్ని వినియోగించనున్నట్టు సాయిబాబా సంస్థాన్ తెలిపింది. భక్తుడు తన పేరును వెల్లడించవద్దని కోరినట్టు పేర్కొంది. మహారాష్ట్ర గుడి పాద్వా సందర్భంగా సాయిబాబాను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు.