26 మార్చి, 2012

సల్మాన్, కమల్ హాసన్, జాకీచాన్...300 కోట్ల సినిమా?

                         Jocky Chan - Salman Khan - Kamal  Hassan 


వాంటెడ్, దబాంగ్, బాడీగార్డ్ లాంటి వరుస హిట్లతో దూసుకెలుతున్న బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్...త్వరలో భారీ బడ్జెట్ సినిమాతో చరిత్ర సృష్టించబోతున్నాడని సమాచారం. భారత దేశ సినీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కనీవినీ ఎరుగని రీతిలో రూ. 300 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందుతున్నట్లు చర్చించుకుంటున్నారు. ఇటీవల దర్శకుడు ఆస్కార్ రవిచంద్రన్ సల్మాన్ ఖాన్‌ను సంప్రదించాడని, చిత్రం గురించి వివరించాడని తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ తో పాటు కమల్ హాసన్, జాకీ చాన్‌లు కూడా ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారని సమాచారం. హిందీ, ఇంగ్లీష్, తమిళంలో ఈచిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. బాలీవుడ్ జనాలను ఆకర్షించడానికి సల్మాన్ ఖాన్, దక్షిణాది జనాలను ఆర్షించడానికి కమల్ హాసన్, ఇతర దేశాల్లో సినిమాను సక్సెస్ చేయడానికి జాకీ చాన్‌ను తారాగణంగా ఎంపిక చేశారు. ఈ చిత్రం సబ్జెక్టు కూడా విభిన్నంగా, మునుపెన్నడూ లేని విధంగా ఉంటుందని బాలీవుడ్ టాక్. త్వరలోనే ఈచిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.