24 మార్చి, 2012

‘భోపాల్’ బాధితులకు రూ.134 కోట్ల పరిహారం

భోపాల్ గ్యాస్ బాధితులకు రూ.134 కోట్లు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలో సమావేశమయిన కేంద్ర మంత్రి మండలి ఈ మేరకు ఆమోదం తెలిపింది. కేన్సర్, మూత్రపిండ సమస్యలతో బాధపడుతున్న మరో 9 వేల మంది బాధితులకు ఈ మొత్తాన్ని పరిహారంగా ప్రభుత్వం అందించనుంది. వివిధ కేటగిరిల కింద బాధితులకు రూ. 740 కోట్లు పరిహారంగా అందజేయాలని 2010 జూన్, నవంబర్‌లో కేంద్రం నిర్ణయించింది. కేన్సర్, మూత్రపిండ సమస్యలతో బాధపడుతున్న భోపాల్ గ్యాస్ బాధితులకు రూ. 134 కోట్లు పరిహారం అందజేయాలని ఈ జనవరిలో సమావేశమయిన మంత్రి మండలి ప్రతిపాదించింది. దీంతో 12 వేల మందికి పరిహారం అందనుంది.