20 ఫిబ్ర, 2012

సచిన్ టెండుల్కర్ కు MRI స్కాన్

బ్రిస్బేన్ : మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌కు వైద్యులు ఎమ్మారై స్కాన్‌ తీశారు. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో బ్రెట్‌ లీ బౌలింగ్‌లో ఓ బంతి సచిన్‌ హెల్మెట్‌కు బలంగా తాకింది. మాస్టర్‌ కుడి కన్నుపై తగలడంతో ముందు జాగ్రత్తగా స్కాన్‌ తీస్తే మంచిదని వైద్యులు సూచించారు. బంతి తగిలిన తర్వాత కూడా అలాగే బ్యాటింగ్‌ చేసిన మాస్టర్‌ కాసేపటికే ఔటయ్యాడు. పెవిలియన్‌లో అతనికి ఐస్‌ ట్రీట్‌మెంట్ చేశారు.