25 ఫిబ్ర, 2012

వన్డే కెరీర్‌కు స్వస్తి చెప్పనున్న సచిన్ టెండూల్కర్!?

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పరిమిత ఓవర్ల వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకోనున్నాడని వార్తలొస్తున్నాయి. అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో సుదీర్ఘ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ ప్రకటించడం మంచిదని కొందరంటుంటే.. మరికొందరు మాస్టర్ ఇలాంటి సలహాలు పాటించాల్సిన అవసరం లేదంటున్నారు. 

ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో ప్రపంచ రికార్డులు సాధించిన సచిన్, ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో త్వరలో సచిన్ తన వన్డే కెరీర్‌కు స్వస్తి చెప్పే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌ భాగంగా ఐదు ఇన్నింగ్స్‌ల్లో ఆడిన సచిన్ 90 పరుగులు మాత్రమే సాధించాడు. 

ప్రస్తుతం ముక్కోణపు సిరీస్‌లో భాగంగా ఇకపై జరిగే రెండు వన్డేల్లో భారత్ గెలుపొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ రెండు మ్యాచ్‌ల్లో భారత్ గెలిచినట్లైతే ఈ టోర్నీకి తర్వాత సచిన్ రిటైర్మంట్ ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఒకవేళ ముక్కోణపు సిరీస్‌లో భారత్ ఓడిపోతే ఢాకాలో జరిగే ఆసియన్ ట్రోఫీకి అనంతరం మాస్టర్ తన వన్డే కెరీర్‌కు స్వస్తి చెప్పే అవకాశం ఉందని తెలిసిందే.