24 ఫిబ్ర, 2012

దర్శకురాలిగా మారుతున్న తెలుగు హీరోయిన్

ప్రముఖ నిర్మాత రామానాయుడు నిర్మించి ముగ్గురు సినిమాలో హీరోయిన్ నటించిన సౌమ్య బొల్లప్రగడ ఆ తర్వాత ఏ సినిమాలోనూ అవకాశం దక్కించుకోలేక పోయింది. ఆమె పర్సనాలిటీ, ఫిజిక్ కూడా హీరోయిన్ వేషాలకు తగిన విధంగా లేక పోవడంతో అమ్మడు ప్రస్తుతం దర్శకత్వం వైపు చూస్తోంది. ఓ ప్రముఖ పత్రికతో ఆమె మాట్లాడుతూ తాను త్వరలో ఓ ద్విబాషా చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నానని, ఇంగ్లీష్ మరియు హీందీ బాషల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు.

అంతే కాదు ఈచిత్రాన్ని లడఖ్ ఫిల్మ్ ఫెస్టివల్ కు పంపే యోచనలో కూడా ఉందట. ఈ చిత్రానికి కోన వెంకట్ స్ర్కిప్టు రాస్తుండగా...శరత్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారని సౌమ్య చెప్పుకొచ్చింది. డిఫరెంట్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామి, యువతీ యువకుల మధ్య జరిగే ప్రేమను ప్రత్యేక కోణంలో చూపించబోతున్నామని చెప్పుకొచ్చింది. ఈ చిత్రంలో సౌమ్య కూడా ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనుందట.

ఉట్టికెగరలేనమ్మ....ఇంకేదో అందుకోవడానికి ప్రయత్నించిందట. హీరోయిన్ గా రాణించలేక పోవడంతో దర్శకత్వం వైపు మొగ్గు చూపుతున్న సౌమ్య మరి ఇందులో రాణిస్తుందో..? లేక ఏదో టైమ్ పాస్, సినీ సెలబ్రిటీ హోదా పొందడానికి ఈ ప్రయోగం చేస్తుందో..? త్వరలోనే తేలనుంది.