20 ఫిబ్ర, 2012

మంచులో మృత్యుంజయుడు

మైనస్ ముప్ఫై డిగ్రీల చలి...పైగా తిండి లేదు...కారు మంచు కింద ఇరుక్కుపోయింది. రెండు నెలలు గడిచిపోయింది. కారులో ఏవరు లేకుంటే ఇబ్బంది లేదు..కానీ ఆ కారులో 45 సంవత్సరాల వ్యక్తి ఉంటే బ్రతకడం సాధ్యమా...కుటుంబసభ్యులే ఆశలు వదులుకున్నారు. కానీ స్వీడన్ కు చెందిన వ్యక్తి మాత్రం మృత్యువును జయించాడు. మంచును తవ్వుతుండగా రెండు నెలల క్రితం ఇరుక్కుపోయిన కారు కనిపించింది. అందులో వెనుక సీటులో ఓ వ్యక్తిని గుర్తించారు. 

ఒకటి రెండు పదాలకు మించి మాట్లాడలేని స్థితిలో ఉండటంతో వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు. ఒక రకమైన నిద్రాణ స్థితిలోకి జారిపోవడంతో ఇతను రెండు నెలల పాటు ఆహారం లేకున్నా బతకగలిగారని వైద్యులు చెప్పారు. మంచును కరిగించుకుని తాగడం వల్ల బతికి ఉంటారని అంటున్నారు.