25 ఫిబ్ర, 2012

అవును సర్జరీ చేయించుకున్నా...శృతి హాసన్

సాధారణంగా ఆర్టిస్టులు తాము చేయించుకున్న సర్జరీలు గురించి మీడియా వద్ద మాట్లాడటానికి ఆసక్తి చూపరు. కానీ శృతికి అటువంటి భయాలేమీ లేవు. ఆమె ముక్కుకు సంభందించిన ఆపరేషన్ చేయించుకుంది. ఆమె బాలీవుడ్ ఎంట్రీ సమయంలో ఆ ఆపరేషన్ జరిగింది. ఆ విషయాన్ని ఆమె చాలా కాలం తర్వాత గుర్తు చేసుకుంటూ...నేను అమెరికా వెళ్లి ముక్క ఆపరేషన్ చేయించుకున్నది నిజమే. అయితే మెడికల్ ప్లాబ్లంలతో చేయించుకున్నా. నాకు బ్రీతింగ్ సమస్య ఉండేది. దాంతో ఆ ఆపరేషన్ అవసరమైంది. ఆ సర్జరీ సమయంలో చాలా భయపడ్డాను. నా గొంతుకు ఏమన్నా ఎఫెక్టు అవుతుందేమేనని...అయితే అది చాలా మైనర్ ఆపరేషన్ అని ధైర్యం చెప్పి వైద్యులు సునాయిసంగా చేసేసారు. ఆ సర్జరీ తర్వాత చాలా హ్యాపీగా నిద్రపోగలుగుతున్నాను. ఇదంతా 2009లో లక్ సినిమా ఒప్పుకోవటానికి ముందు జరుగింది. ఇక ఈ వివరాలన్నిటిని ఆమె బిగ్ సిబిఎస్ లైవ్ షో పోగ్రామ్ లో చెప్తున్నానంది. ఇక ప్రస్తుతం ఆమె పవన్ కళ్యాణ్ సరసన గబ్బర్ సింగ్ చిత్రంలో చేస్తోంది. అలాగే అల్లు అర్జున్ సరసన ఓ చిత్రం కమిటైంది.