23 ఫిబ్ర, 2012

కార్తిని చూసి చాలా నేర్చుకోవాలి: రాజమౌళి

అన్నదమ్ములిద్దరూ చాలా కష్టపడతారు. అటు తమిళంలోనూ ఇటు తెలుగులోనూ తమకంటూ ఒక ఇమేజ్ ఏర్పడుచుకున్నారు. వాళ్లని చూసి మనం చాలా నేర్చుకోవాలి అన్నారు రాజమౌళి. ప్రముఖ దర్సకుడు రాజమౌళి చేతుల మీదుగా కార్తి నటించిన మల్లిగాడు చిత్రం ఆడియో విడుదల అయ్యింది. తమిళంలో కార్తీ,ప్రియమణి కాంబినేషన్ లో రూపొందిన పరుత్తి వీరన్ చిత్రంని తెలుగులో మల్లిగాడు టైటిల్ తో డబ్బింగ్ చేస్తున్నారు. మార్చి ఎనిమిదిన విడుదల కానున్న ఈ చిత్రం ఆడియో నిన్న సాయింత్రం రాజ్ దక్కన్ హోటల్ లో మధురా ఆడియో ద్వారా విడుదలైంది. ఈ పంక్షన్ కి శ్రీనువైట్ల,రాజమౌళి ముఖ్య అతిధులుగా విచేచ్సారు. 

ఇక హీరో కార్తీ మాట్లాడుతూ...ఇన్ని రోజులూ నాకు నా మొదటి సినిమా తెలుగులో విడుదల కాలేదనే వెలితిగా ఉండేది. ఇది మొత్తానికి తీరిపోయింది. ఈ రోజు కోసం నేను చాలా ఎక్సైట్మెంట్ గా ఎదురుచూస్తున్నాను. సినిమాలు చాలా వస్తాయి కానీ, ప్రేమాభిషేకం,మరోచరిత్ర వంటి చిత్రాలు అప్పుడప్పుడు వస్తాయి. అలాంటిదే ఈ మల్లిగాడు సినిమా. ఇలాంటి సబ్డెక్ట్ నా మొదటి సినిమాకే రావటం నా అదృష్టం. అమీర్ చాలా అద్బుతంగా తీసాడు. ఈ సినిమా ద్వారా ప్రియమణికి నేషనల్ అవార్డ్ వచ్చింది. ఈ చిత్రాన్ని గత నా చిత్రాలు లాగానే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని భావిస్తున్నాను అన్నారు.