19 ఫిబ్ర, 2012

ప్రస్తుతం పవన్ కి గాడ్ ఫాధర్ ఆయనే

పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన ఫంధా మార్చి ప్రయోగాలను ప్రక్కన పెట్టి రెగ్యులర్ కమర్షియల్ సినిమాల వైపు ప్రయాణం పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ మార్పు వెనకాల ఎవరు ఉన్నారు అంటే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు అని వినపడుతోంది. ఆయన పవన్ కళ్యాణ్ కి గాడ్ ఫాధర్ లా వ్యవరిస్తున్నారని చెప్తున్నారు. ఆర్కా మీడియాలో చేసిన పంజా చిత్రం సమయంలో ఆ నిర్మాతల చుట్టమైన రాఘవేంద్రరావుతో పవన్ కి మంచి రాపో పెరిగిందని చెప్తున్నారు. దాంతో ఆయన సూచనల మేరకు అపజయాల నుంచి తప్పించుకోవటానికి కమర్షియల్ సినిమాలు ఒప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నాడని చెప్పుకుంటున్నారు. అందులో భాగమే గబ్బర్ సింగ్,కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రాలు అంటున్నారు. ఇక త్వరలో రాజమౌళి,పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో రూపొందే చిత్రం కూడా ఈ స్టాటజీలో భాగమే అంటున్నారు. ఇక రాఘవేంద్రరావుకు కమర్షియల్ చిత్రాల దర్శకుడుగా చాలా పేరుంది. గతంలో ఆయన రూపొందించిన ఎన్నో చిత్రాలు సూపర్ హిట్స్ అయ్యి రికార్డులు సృష్టించాయి. ప్రస్తుతం ఆయన నాగార్జున హీరోగా షిర్డీ సాయి చిత్రం చేస్తున్నారు. పవన్ విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం హరీష్ శంకర్ దర్సకత్వంలో రూపొందుతున్న గబ్బర్ సింగ్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.