23 ఫిబ్ర, 2012

రామ్ చరణ్ ‘రచ్చ’ స్టోరీ ఇదేనా...?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో రచ్చ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. చరణ్ తండ్రిగా తమిళ నటుడు పార్తిబన్ ఫ్లాష్ బ్యాక్‌లో అతిథి పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రంలో చెర్రీ మెడికో పాత్రలో నటిస్తున్నాడు. అని పాత్ర పేరు విశ్వం. 

ఈ సినిమా స్టోరీపై సినీ పరిశ్రమలో జరుగుతున్న పచారం ప్రకారం....రామ్ చరణ్ తండ్రి పార్తిబన్ అతని ఒక బాధ్యతను అప్పగిస్తాడు. వారి గ్రామంలో ఉండే నీటి సమస్యను తీర్చాలని చెబుతాడు. అయితే ఈ సమస్య సాల్వ్ కావాలంటే...రాజకీయ ఇబ్బందులు, రాజకీయ నాయకుల కుట్రలను ఛేధించాలి. డాన్స్ అకాడమీలో పరిచయం అయిన తమన్నాతో విశ్వం(రామ్ చరణ్) ప్రేమలో పడతాడు. సమస్యను పరిష్కరించే క్రమంలో విశ్వంకు అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. మరి విశ్వం వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? గ్రామ నీటి సమస్యను ఎలా తీర్చాడు? అనేది సినిమా క్లైమాక్స్ అని అంటున్నారు. 

అయితే ఈ స్టోరీ రవితేజ హీరోగా వచ్చిన ‘వీడే’ చిత్ర స్టోరీలా ఉంది, ఇదంతా పుకారే కావచ్చని మరికొందరు అంటున్నారు. మరి సినిమా అసలు స్టోరీ ఇదేనా.? కాదా? అనేది తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఎన్వీ ప్రసాద్, పరాస్ జైన్ నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి రచన: పరుచూరి బ్రదర్స్‌, ఛాయాగ్రహణం:సమీర్‌రెడ్డి, కూర్పు: గౌతంరాజు, కళ: ఆనంద్‌సాయి.