12 ఫిబ్ర, 2012

జగన్‌ను విజయమ్మ వెంటనే పోలీసులకు అప్పగించాలి: రేవంత్


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి శిక్ష తగ్గాలంటే పులివెందుల శాసనసభ్యురాలు విజయమ్మ తన తనయుడిని పోలీసులకు వెంటనే అప్పగించాలని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి సూచించారు. తల్లిగా జగన్ చేస్తున్న తప్పులను ఆమె సరిదిద్దాలన్నారు. లేదంటే జగన్‌ను ఎప్పుడూ జైళ్లో చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు.


ఆదివారం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. జగన్ జైలు శిక్షపై రేవంత్ రెడ్డి విజయమ్మ సూచన చేశారు. అలాగే దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలోని భూకేటాయింపుల పైన వేసిన సభా సంఘం విషయంలో స్పీకర్ నాదెండ్ల మనోహర్ పైన ఆయన మండిపడ్డారు.

స్పీకర్ తీరు చూస్తుంటే వైయస్, జగన్‌కు క్లీన్ చిట్ ఇచ్చేందుకే సభా సంఘం వేసినట్లుగా ఉందన్నారు. జగన్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మ్యాచ్ ఫిక్సింగ్ వల్లే సభా సంఘం