28 ఫిబ్ర, 2012

రామ్ చరణ్ కి విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో

రామ్ చరణ్ త్వరలో హిందీ చిత్రం జంజీర్ రీమేక్ లో చేయనున్నాడనే సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కనిపించనున్నాడు. అగ్నిపథ్ లో విలన్ గా అదరకొట్టిన సంజయ్ దత్ ని ఈ పాత్రకు ఎంపిక చేస్తూండటంతో సినిమాపై మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. జంజీర్ లోని షేర్ ఖాన్ పాత్రను గతంలో ప్రాణ్ చేసారు. ఇప్పుడు సంజయ్ దత్ చేయనున్నారు. ఇక ఈ చిత్రం షూటింగ్ కి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఏప్రియల్ 20 న షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఆ రోజు నుంచి పది రోజులు పాటు రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. వివి వినాయిక్ తో చేస్తున్న చిత్రం గ్యాప్ లో ఈ చిత్రానికి డేట్స్ ఇచ్చాడు. 

ప్రస్తుతం వినాయక్ చిత్రం షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ పూర్తైంది. దాంతో వంశీ పైడిపల్లి దర్సకత్వంలో రూపొందే ఎవడు చిత్రం షూటింగ్ కి వెళ్లనున్నాడు. మరో ప్రక్క రచ్చ చిత్రం ప్యాచ్ వర్క్ లలో పాల్గొంటున్నాడు. ఈ జంజీర్ చిత్రం రీమేక్ ని రిలియన్స్ బ్యానర్ పై అమిత్ మెహ్రా నిర్మించనున్నారని, అపూర్వ లకియా దర్శకత్వంలో రూపొందనుందని తెలుస్తోంది. ఆయిల్ మాఫియా బ్యాక్ డ్రాప్ తో జంజీర్ రీమేక్ ని రామ్ చరణ్ తో చేస్తున్నట్లు దర్శకుడు అపూర్వ లఖియా మీడియాతో చెప్పారు. 

అప్పటి కథని ఈ తరానికి తగినట్లు మార్చి స్క్రిప్టు తయారు చేసానని చెప్పుకొస్తూ ఈ విషయం వివరించారు. అలాగే జర్నిలిస్టు జె డి ని చంపే ఎపిసోడ్ ని కూడా ఈ స్క్రిప్టు లో కలుపుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఇక బాలీవుడ్ లో ఎస్టాబ్లిష్ అయ్యిన స్టార్ హీరోయిన్ ని రామ్ చరణ్ ప్రక్కన తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ జంజీర్ చిత్రం రీమేక్ ని రిలయన్స్ బ్యానర్ పై అమిత్ మెహ్రా నిర్మించనున్నారు.