15 ఫిబ్ర, 2012

మా మామగారు అంగీకరిస్తేనే... జెనీలియా

జెనీలియా కి రీసెంట్ గా పెళ్లైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె ఓ మాజీ ముఖ్యమంత్రి కోడలు. దాంతో ఆమె ఆ కుటుంబ పేరు ప్రఖ్యాతులను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన భాధ్యత ఆమెపై పడింది. దాన్ని దృష్టిలో పెట్టుకునో ఏమో కానీ మీడియా వారు అడిగిన ప్రశ్నలకు మా మామగారుని అడిగి చెప్తా అంటోంది. తాజాగా ఆమె రాజకీయాల్లోకి రాబోతోంది. వచ్చే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మామ విలాస్‌రావు దేశ్‌ముఖ్ తరఫున జెన్నీ ప్రచారంలో పాల్గొనబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. దానిపై ఆమెని మీడియావారు కదిపితే ఆమె స్పందిస్తూ...నిజంగా అంకుల్‌కి నేను ప్రచారం చేస్తే మంచి జరుగుతుందనుకుంటే... ఆయన కోడలిగా ప్రచారానికి తప్పకుండా వెళతాను.

అయితే... ప్రస్తుతం వినిపిస్తున్న గాసిప్పు మాత్రం ఎవరో పనిలేనివాళ్లు క్రియేట్ చేసినది. ఈ గాసిప్పుతో మా ఇంట్లో ఎవరికీ ప్రమేయం లేదు అంది. అది సరే మీరు రాజకీయాల్లోకి వస్తారా అంటే...రాజకీయాల్లోకి వస్తే తప్పేంటి? అదేం నేరం కాదే. అయినా ప్రస్తుతానికి నేను వాటి గురించి ఆలోచించే స్థితిలో లేను. నేను పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. నా ఇంటికోసం, నావారి కోసం రాజకీయాల్లోకి రావాల్సి వస్తే తప్పకుండా వస్తాను. దానికి మావారి అభిప్రాయమే కాదు... మా మామగారి అంగీకారం కూడా అవసరం అని తేల్చేసింది. ఆమె తాజా చిత్రం నా ఇష్టం త్వరలో విడుదల అవ్వుతోంది. రానా హీరోగా చేసిన ఈ చిత్రం ద్వారా ప్రకాష్ తోలేటి అనే దర్శకుడుని పరిచయం అవుతున్నాడు.