23 ఫిబ్ర, 2012

మొగున్ని వెతకమని అమ్మతో చెప్పిన కత్రినా..

బాలీవుడ్ కత్తిలాంటి ఫిగర్ కత్రినా కైఫ్ తరచూ ఏదో సంచలనంతో మీడియాలో హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది. సల్మాన్ సహాయంతో బాలీవుడ్ లో నిలదొక్కుకున్న ఈ భామ అతనితో ఆ మధ్య హద్దులు దాటి ప్రేమాయణం నెరపిందనే వార్తలు కూడా వినిపించాయి. ఆ తర్వాత ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో విడిపోయారు. అనంతరం షాహిద్ కపూర్, రణబీర్ కపూర్ లతో తెరచాటు వ్యవహారాలు నడిపిందనే గుసగుసలు కూడా వినిపించాయి. అందరినీ ఆశ్చర్య పరిచేలా పాత చెలికాడు సల్మాన్ ఖాన్ తో మళ్లీ కలవడం, ఆయనతో కలిసి నటించిన ఘనత కూడా ఆవిడదే.

తాజాగా కత్రినా గురించిన ఓ వార్త మీడియాలో చర్చనీయాంశం అయింది. అందరినీ కాదని కత్రినా అరేంజ్డ్ మ్యారేజ్ పై మొగ్గు చూపుతోందట. తనకు ఈడు జోడు అయిన మగాన్ని వెతకమని, పెళ్లి చేసుకోవడానికి సిద్దంగా ఉన్నానని అమ్మతో చెప్పిందట. కత్రినా సన్నిహితులు ప్రముఖ పత్రికతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించినట్లు ప్రచారం జరుగుతోంది. 

కత్రినా ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తో కలిసి ఏక్ థా టైగర్ చిత్రంలో నటిస్తోంది. దీంతో పాటు యష్ రాజ్ చోప్రా నిర్మిస్తున్న సినిమాలోనూ అవకాశం దక్కించుకుంది. ధూమ్2 సీక్వెల్ ధూమ్3లోనూ కత్రినా ఎంపికైంది.