24 ఫిబ్ర, 2012

పవన్ కళ్యాణ్‌కి 'తిక్క..కానీ దానికో లెక్క ఉంది'!


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సిసిమా ‘గబ్బర్ సింగ్’ టీజర్ ఎట్టకేలకు బయటకు విడుదలైంది. ఈ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోలీస్ గెటప్‌తో ఎనర్జిటిక్‌గా కనిపిస్తుండటంతో ఈ టీజర్‌కు గ్రేట్ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ఈ టీజర్లో పవన్ చెప్పే ‘ నాకు కొంచెం తిక్క ఉంది...కానీ దానికి ఒక లెక్క ఉంది’ అనే పంచ్ డైలాగ్ కేక అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టీజర్‌లోనే సినిమా విజయం కనిపిస్తోందని అంటున్నారు.

‘గబ్బర్ సింగ్’ సినిమాలో పవర్ స్టార్ కొండవీడు పోలీస్ గా కనిపించబోతున్నాడు. వాస్తవానికి ఈ సినిమా హీందీ దబాంగ్ మూవీకి రీమేక్ అయినప్పటికీ....దర్శకుడు హరిష్ శంకర్ ఈ సినిమాను తెలుగు నేటి విటీకి అనుగుణంగా మార్పులు చేర్పులు చేశారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన శృతి హాసన్ నటిస్తోంది. పవన్ కళ్యాణ్ ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. చట్టం చూపిన దారిలో వెళితే నేరస్తులను అదుపులో పెట్టడం చాలా కష్టం. అందుకే గబ్బర్ సింగ్ తనదైన శైలిలో రౌడీలకు రౌడీగా తన తడాఖా చూపిస్తూ ఉంటాడు.

ఈ చిత్రం తర్వాత పవన్ కళ్యాన్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘కెమెరా మెన్ గంగతో రాంబాబు’ చిత్రంలో నటించనున్నాడు. ఇందులో పవన్ కళ్యాణ్ సరసన కాజల్ ను ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.