16 ఫిబ్ర, 2012

ఆ స్టార్ హీరోకి అనుష్క ప్రేరణ ఇస్తోంది

తమిళ స్టార్ హీరో ధనుష్ తనకు అనూష్క ఇన్సిప్రేషన్ అంటున్నాడు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... అనూష్కలాంటి పాజిటివ్ పర్శన్ ని ఇప్పటివరకూ చూడలేదు. ఆమె అప్ సెట్ అవ్వటం నాకు కనపడలేదు. నాకు ఎప్పుడైనా కొద్దిగా అన్ కంఫర్ట్ గా ఫీలైతే స్వీటి నన్ను ధైర్యం చెప్పి ఉషారు తెప్పిస్తుంది. ఆమె పంపించే మెసెజ్ లు నన్ను ఎంతగానో మోటివేట్ చేస్తూంటాయి. అవి చదువుతూంటే నవ్వు వస్తుంది...అదే సమయంలో ఓ తెలియని ఉత్సాహం వస్తుంది..ఆమె నాకు బెస్ట్ ప్రెండ్ అంటూ చెప్పుకొచ్చాడు. 

ఇక వీరిద్దరూ కలిసి రీసెంట్ గా సచిన్ ఏంధమ్ ని చేసారు. క్రికెటర్ సచిన్ కు ట్రిబ్యూట్ గా దీన్ని చేసారు. ధనుష్ దర్శకత్వంలో ఈ సాంగ్ తెరకెక్కింది. అయితే ఇప్పుడు హఠాత్తుగా అనూష్కని పొగిడే పనిలో ఎందుకు పడ్డాడనే సందేహం కోలీవుడ్ వర్గాల్లో కలుగుతోంది. శృతిహాసన్ వైపు నుంచి జనాల దృష్టిని మరల్చటానికే ఇలా స్టేట్ మెంట్ ఇచ్చాడని మీడియా అంటోంది. ఇక అనూష్క విషయానికి వస్తే ఆమె కు తెలుగులో ఢమురకం సినిమా తప్ప మరో సినిమా లేదు.