24 ఫిబ్ర, 2012

సినీ తారలతో ’నాటా స్టార్ నైట్’

నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్(NATA) ఆధ్వర్యంలో ఫిబ్రవరి 25న స్టార్ నైట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా దర్శకుడు ఎస్.వి.కృష్ణారెడ్డి హాజరు కానున్నారు. అందాల తారలు కామ్నా జఠ్మలాని, పూనం కౌర్ , సౌమ్య రాయ్, కల్పనా, పద్మిని డాన్సు లతో కను విందు చేయనున్నారు. హాస్య నటులు , రఘు బాబు , ఉత్తేజ్, శివాజీ రాజా తదితరులు హాస్యపు జల్లులు కురిపించబోతున్నారు. అభినయ కృష్ణ మిమిక్రీ చేస్తారు. శ్రీలేఖ , సింహ గానామృతంతో సందడి చేయనున్నారు. కాలిఫోర్నియా గ్లెండోరాలోని హగ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ సెంటర్లో ఈ కార్యక్రమం జరుగనుంది.

ఈ కార్యక్రమమునకు నాట నాట అధ్యక్షుడు ఏ.వి.ఎన్.రెడ్డి, ఇతర ప్రతినిధులు డాక్టర్ ప్రేమ రెడ్డి, డాక్టర్ మల్లా రెడ్డి, డాక్టర్ మోహన్ మల్లం, ధర్మా రెడ్డి, ఝాన్సీ రెడ్డి, రాజేశ్వర్ గంగసాని, డాక్టర్ సంజీవ రెడ్డి టంగుటూరు, మోహన్ రెడ్డి కలాడి, శ్రీనివాస్ గానగొని హాజరు కానున్నారు. మల్లిక్ బండ, అనిల్ ఎర్రబెల్లి, నాగేశ్వర్ అంకమ్మ, డెన్నిస్ విల్సన్ ఆధ్వర్యంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదే విధంగా డాక్టర్ ప్రేమ రెడ్డి గారి " Prime Healthcare Services Foundation " ఆధ్వర్యంలో హెల్త్ ఫెయిర్- ఉచిత వైద్య సేవలు అందించే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు.