24 ఫిబ్ర, 2012

విద్యా బాలన్ లవ్వర్ అరెస్ట్

విద్యాబాలన్ లవర్ అరెస్టు అయ్యాడు. లవర్ అంటే విద్యా ప్రేమిస్తున్న సిద్ధార్థ రాయ్ కపూర్ కాదు లెండి. ఇతగాడు విద్యాను ప్రేమిస్తున్న అభిమాని. ఎప్పటి నుంచో విద్యా బాలన్ పై మోజు పెంచుకున్న సదరు అజ్ఞాత అభిమాని, డర్జీ పిక్చర్ లో ఆమె అందాలు, అభినయం చూసి ప్రేమించడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో గత కొంత కాలంగా ఆమెను ఫాలో చేస్తూ ఆమె ఉండే ఫ్లాట్ వద్దకు వచ్చి రోజూ ఆమెను చూసే వాడట. ఇటీవల కాస్త ధైర్యం చేసి ఏకంగా ఆమె ఫ్లాట్ లోకి వెళ్లాడు. అయితే ఆ సమయంలో విద్యా ఇంట్లో లేదు. విద్యా సిస్టర్ తలుపు తెరవగానే విద్యా గురించి ఆరా తీశాడు. 

విద్యా బాలన్ ఇంట్లో లేనది, బయటకు వెళ్లిందని ఆమె సమాధానం ఇవ్వడంతో...మేనకోడలు, మేనల్లుడుతో బయటకు వెళ్లిందా..? అని అతడు ఎదురు ప్రశ్నించాడట. దీంతో షాక్ అయిన విద్యా బాలన్ సిస్టర్ అతడు రోజు విద్యాను ఫోలో చేస్తున్న విషయాన్ని గ్రహించి సెక్యూరిటీని అలర్ట్ చేసింది. మర్నాడు రోజూ మాదిరి మళ్లీ అతడు విద్యాను ఫాలో అవుతుండటం గమనించి పోలీసుల సహాయంతో అతన్ని అరెస్టు చేశారు