27 ఫిబ్ర, 2012

మరోసారి మావోయిస్టుల విధ్వంసం

ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టులు మరోసారి విధ్వంసానికి పాల్పడ్డారు. బస్తర్ జిల్లా జగ్ధల్ పూర్ సమీపంలోని ఫర్సా పోలీస్ స్టేషన్ పరిథిలో 12 మందుపాతర్లు అమర్చి పలు వాహనాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో సుమారు 30 నుంచి 40మంది మావోయిస్టులు పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.