25 ఫిబ్ర, 2012

హీరో నాని కూడా ‘టి’లో చేరాడండోయ్!

భీమిలి కబడ్డీ జట్టు, అలా మొదలైంది, పిల్ల జమిందార్ చిత్రాల ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాని తాజాగా ఈ రోజు ట్విట్టర్లో చేరాడు. ఈ విషయాన్ని దర్శకుడు రాజమౌళి దృవీకరించారు. నానికి వెల్ కం చెప్పారు. ‘కొత్తగా రెక్కలొచ్చేనా..ఫైనల్లీ ఐయామ్ ఇన్ ట్విట్టర్’ అంటూ తొలి ట్వీట్ చేశారు. అదే విధంగా తనకు వెల్ కం చెప్పినా రాజమౌళికి థాంక్స్ చెబుతూ ట్వీట్ చేశాడు. నాని ట్విట్టర్ ఐడి twitter.com/#!/NameisNani

నాని ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘ఈగ’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈచిత్రంలో నానితో పాటు సమంత, కన్నడ యాక్టర్ సుదీప్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గ్రాఫిక్స్ ప్రధానంగా రాజమౌళి ఈచిత్రాన్ని రూపొందిస్తున్నారు. హీరో నాని ఇందులో మరణించి ఈగగా మారుతాడని సమాచారం. ఈ చిత్రం ఒకేసారి తెలుగు, తమిళంలో విడుదల చేస్తున్నారు. 

దీనితో పాటు ‘ఎటో వెళ్లి పోయింది మనసు’ చిత్రంలోనూ నాని హీరోగా నటిస్తున్నాడు. గౌతం మీనన్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో నాని సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. ఇళయరాజ సంగీతం అందిస్తున్నారు.