26 ఫిబ్ర, 2012

మ్యూజిక్ స్కూల్‌ను ప్రారంభించనున్న సోనియా అగర్వాల్!!

7/G బృందావన్ కాలనీ' చిత్రంలో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన సోనియా అగర్వాల్. ఈ ముద్దుగుమ్మ.. తమిళ దర్శకుడు సెల్వరాఘన్‌ను వివాహం చేసుకుంది. వీరి వివాహం పెటాకులు కావడంతో విడాకులు తీసుకున్నారు. 

ఆ తర్వాత వెండి తెరపై రెండో ఇన్నింగ్స్‌ను సోనియా అగర్వాల్ ప్రారంభించింది. ఈ సెకండ్ ఇన్నింగ్స్‌ క్లిక్ కాలేదు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న సోనియా అగర్వాల్.. తన సోదరుని సహకారంతో మ్యూజిక్ స్కూల్‌ను ఏర్పాటు చేయనుంది. 

యువ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా వద్ద అసోసియేట్‌గా పని చేస్తున్న సోనియా అగర్వాల్ సోదరుడు సౌరభ్‌తో కలిసి చెన్నైలో ఓ మ్యూజిక్ స్కూల్‌ను ఏర్పాటు చేసే ప్రయత్నంలో బిజీగా ఉంది. ఈ మ్యూజిక్ స్కూల్ ఈనెల 28వ తేదీన ప్రారంభం కానుంది.