17 ఫిబ్ర, 2012

హీరో అసభ్య ప్రవర్తనపై ప్రియమణి వివరణ

సీసీఎల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ప్రియమణితో బాలీవుడ్ హీరో సచిన్ జోషీ అసభ్యంగా ప్రవర్తించాడంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే వాటిని ఖండిస్తోంది ప్రియమణి. ఇవన్నీ మీడియా పుట్టించిన రూమర్స్ అంటూ కొట్టిపారేసింది. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ...అలాంటి ఇన్సిడెంట్ ఏమీ జరగలేదు. ఇదంతా కూడా జర్నిలిస్టుల ఇర్రెస్పాన్సబులిటీ నుంచి పుట్టిందే. ఇలాంటి వార్తలు మా మధ్యన ఉండే ఆరోగ్యవంతమైన రిలేషన్ షిప్ లను పాడుచేస్తాయి అంది. అలాగే తాను సచిన్ జోషి కలిసి త్వరలోనే జాయింట్ గా ప్రెస్ మీట్ పెడతామని చెప్పింది. 

అలాగే ఇలాంటి న్యూస్ లు ప్రకటించేటప్పుడు ఆ పత్రికలు తమను అడిగి కన్ఫర్మ్ చేసుకుని వేస్తే ఇద్దరికీ ఇబ్బందిలేని వ్యవహారమని అంది. ఇక ఆ సంఘటన నిమిత్తం న్యూస్ లో అప్పుడు వచ్చిందేమిటంటే..కొచ్చిలో సీసీఎల్ మ్యాచ్‌ కు సంబంధించిన పార్టీలో సచిన్ జోషి ప్రియమణి చెయ్యి పట్టుకోవడమే కాకుండా బలవంతంగా కౌగిలించుకున్నాడు. సంఘటనా స్థలంలో ప్రియమణి తల్లికూడా ఉంది. కానీ అక్కడ అసలు ప్రియమణే లేదని ఆమె చెబుతోంది. ప్రియమణి షూటింగ్ కు వెళ్లిందని అంటోంది. సచిన్ జోషి కూడా తన తరపున ఓ ఖండన జారీచేశాడు.