25 ఫిబ్ర, 2012

వైఎస్ఆర్‌పై వర్మ సినిమా -‘రెడ్డిగారు పోయారు’

వివాదాస్పద, ఆసక్తికర అంశాలను సినిమా రూపంలో తెరకెక్కించే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా ఇలాంటి కథాంశంతో సినిమా రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాన్ని బేస్ చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మహానేత మరణం తర్వాత రాష్ట్రంలో చోటు చేసుకున్న సంఘటలు, బయట పడ్డ కుంభ కోణాలు, సీఎం కుర్చీ కోసం ప్రాకులాడుతున్న వైనాన్ని ఈ చిత్రంలో చూపించనున్నాడట.

ఈ సినిమా గురించిన వివరాలు వెల్లడిస్తూ శనివారం ప్రెస్ నోట్ విడుదల చేసిన వర్మ...ప్రస్తుతం స్ర్కిప్టును రూపొందించే పనిలో ఉన్నామని, వచ్చే సంవత్సరం ఈ సినిమా షూటింగ్ ప్రారంభిస్తామని తెలిపారు. 

శ్రేయ ప్రొడక్షన్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని కిరణ్ కుమార్ కోనేరు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది వైఎస్ఆర్ గురించి పాజిటివ్ గా ఉంటుందో...? లేక నెగెటివ్ గా ఉంటుందో..? సినిమా విడుదలైతే గానీ తెలీదు. మరి వర్మ తీయబోయే సినిమాపై ఆయన తనయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ స్పందన ఎలా ఉంటుందో? చూడాలి.