18 ఫిబ్ర, 2012

‘పూల రంగడు’ టాక్ ఏంటి?

సునీల్-ఇషా చావ్లా జంటగా....వీరభద్రం దర్శకత్వంలో రూపొందిన ‘పూల రంగడు’ సినిమా ఈ రోజు(ఫిబ్రవరి 18)న విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకుంది. సునీల్ పెర్ఫార్మెన్స్ సినిమాకు హైలెట్ గా నిలిచింది. ఇటు నటన విషయంలోనూ, అటు డాన్సులు బాగున్నాయని ప్రేక్షకుల నుంచి వినిపిస్తున్న మాట. సిక్స్ ప్యాక్ బాడీతో క్లైమాక్స్ లో సునిల్ చేసే ఫైట్ చాలా బాగుందని, ఇప్పటి వరకు కమెడియన్ గా కనిపించిన సునీల్ సిక్స్ ప్యాక్ బాడీతో పెద్ద హీరోలకు ఏ మాత్రం తీసిపోకుండా ఉన్నాడని అంటున్నారు. సినిమాను వినోదాత్మకంగా నడిపించడంలో దర్శకుడు వీరభ్రదం సక్సెస్ అయ్యారు. సినిమాలో అలీ, దువ్వాసి మోహన్, రఘుబాబు, సత్యం రాజేష్ తదితర కమెడియన్ల కామెడీ బాగా పండింది. శ్రీధర్ సీపన రాసిన డైలాగులు సన్నివేశాలకు మరింత ఊపుతెచ్చాయి. అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ, కొరియోగ్రఫీ, ఆర్ట్ ఇలా అన్ని విభాగాల్లోనూ సినిమా బాగుందనే టాక్ వినిపిస్తోంది. నిప్పు, లవ్ ఫెయిల్యూర్ ఇప్పటికే నెగెటివ్ టాక్ సొంతం చేసుకున్న నేపథ్యంలో....ఈ శివరాత్రి హిట్ హీరోగా సునీల్ నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ చిత్రానికి మేకప్: నాగు, కాస్ట్చూమ్స్: ప్రసాద్, స్టిల్స్: ఎస్. ప్రసాద్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: శ్రీరాములు, కో డైరెక్టర్: గంగాధర్, ప్రొడక్షన్ కంట్రోలర్స్: కొత్త మురళీ కృష్ణ, బూరుగుపల్లి శ్రీనివాస్, ఆర్ట్: నాగేంద్ర, మాటలు: శ్రీధర్ సీపన, ఎడిటింగ్: గౌతం రాజు, సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మూరెళ్ల, సంగీతం అనూప్ రూబెన్స్, సమర్పణ: ఆర్ ఆర్ మూవీ మేకర్స్, నిర్మాత: అచ్చిరెడ్డి, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: వీరభద్రం.