13 ఫిబ్ర, 2012

హీరోగా ఎంట్రీపై తేల్చిన అక్కినేని అఖిల్

నాగార్జున రెండో కుమారుడు అఖిల్ ఇటీవల సీసీఎల్ మ్యాచ్ లలో తెలుగు వారియర్స్ తరుపున ఆడి సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ కుర్రాడని మీడియా వారు మరి మీరు సినిమాల్లోకి రారా..క్రికెటర్ గానే సెటిల్ అవుతారా అని ప్రశ్నిస్తే...నేను క్రికెట్ ని ఎంజాయ్ చేస్తాను కానీ నేను ప్రపొషినల్ ప్లేయర్ ని కాదలచుకోలేదు. నాకు యాక్టింగ్ అంటే ఇంట్రస్ట్. నాకు సినిమాలంటే చాలా ఇష్టం. నేను నటుల కుటుంబంలోంచి వచ్చినవాడ్ని. నేను నటుడవ్వాలనే అవకాశాన్ని ఎంచుకోబోతే నేను ఆపర్చునేటీని మిస్ చేసుకున్నట్లే..ప్రస్తుతం అయ్యితే నా దృష్టి మొత్తం బిబిఎ డిగ్రీ కోర్స్ మీదే ఉంది. దాన్ని పూర్తి చేసి సినిమాల్లోకి వస్తాను అన్నారు. 

ఇక నాగార్జున సైతం అక్కినేని అఖిల్ నటుడు అవ్వాలనే ఆలోచనలోనే ఉన్నారు. అయితే ఇంకా టైమ్ ఉందని ఆయన ఇటీవల ఇంటర్వూలలో చెప్పారు. ఇక అఖిల్ సోదరుడు నాగచైతన్య ఇప్పటికే ఫీల్డ్ లో ఉన్నాడు. ఆయన తాజాగా దేవకట్టా దర్సకత్వంలో ఆటో నగర్ సూర్య చిత్రం చేస్తున్నారు. అలాగే రాధామోహన్ దర్సకత్వంలో గౌరవం చిత్రం కమిటై ఉన్నారు.