21 ఫిబ్ర, 2012

పూలరంగడు కలెక్షన్స్ అదుర్స్

సునీల్ తాజా చిత్రం పూలరంగడు కలెక్షన్స్ విషయంలో దూసుకుపోతోంది. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ చిత్రం బిజినెస్ మ్యాన్ రేంజిలో ఈ రెండు రోజులుగా కలెక్షన్స్ అదరకొడుతోందని ట్రేడ్ టాక్. శనివారం రిలీజైన ఈ చిత్రం మార్నింగ్ షో కే హిట్ టాక్ తెచ్చుకోవటం ప్లస్ అయ్యింది. శని,ఆదివారాలు వీకెండ్స్ తో పాటు సోమవారం నాడు శివరాత్రి ఈ చిత్రానికి కలిసి వచ్చిన అంశం. మరో ప్రక్క ఇదే వారం విడుదలైన నిప్పు,లవ్ ఫెయిల్యూర్ చిత్రాలు నెగిటివ్ టాక్ తెచ్చుకోవటం కూడా సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. అంతేగాక ఈ నెలలో మరే పెద్ద చిత్రమూ విడుదల లేకపోవటం కూడా ఈ సినిమాకు లాభిస్తుంది. 

ఇక సునీల్ సినిమా నుంచి ఆశించే కామెడీకి తోడు మాస్ ని అలరించే డాన్స్ లు, సునీల్ సిక్స్ ప్యాక్ సినిమాను నిలబెట్టాయి. ఏ విధంగా చూసుకున్నా ఈ చిత్రం నిర్మాతలకు మంచి లాభాలతో పాటు సునీల్ కెరీర్ కు బాగా ప్లస్ అవుతోంది. దర్సకుడు వీరభధ్రం కి అప్పుడే ఆఫర్స్ రావటం మొదలైనట్లు వినికిడి.