22 ఫిబ్ర, 2012

రవితేజ సినిమాకు తెలంగాణ సెగ, వెళ్లిపోయిన హీరో

హైదరాబాద్: హీరో రవితేజ చిత్రానికి తెలంగాణ సెగ తగిలింది. బుధవారం హైదరాబాదులోని తార్నాక ఆర్టీసి ఆసుపత్రి వద్ద రవితేజ తాజా చిత్రం దరువు షూటింగ్ జరుగుతోంది. రవితేజ చిత్రం షూటింగ్ జరుగుతున్న విషయం తెలుసుకున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు, పలువురు తెలంగాణవాదులు అక్కడకు వచ్చారు. చిత్రం షూటింగ్‌ను అడ్డుకున్నారు. అక్కడి ఫర్నిచర్‌ను విద్యార్థులు ధ్వంసం చేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు.

యూనిట్‌ను జై తెలంగాణ నినాదాలు చేయాలని డిమాండ్ చేశారు. కాగా హీరో విద్యార్థులు, తెలంగాణవాదులు షూటింగ్ అడ్డుకోవడంతో హీరో రవితేజ షూటింగ్ స్పాట్ నుండి వెంటనే వెళ్లిపోయారు. కాగా నాలుగు రోజుల క్రితం రవితేజ నిప్పు చిత్రం విడుదలైన విషయం తెలిసిందే.