23 ఫిబ్ర, 2012

సైప్ అలీఖాన్‌ అరెస్టు వెనక అసలు వాస్తవం..?

బాలీవుడ్ స్టార్, కరీనా కపూర్ ప్రియుడు సైఫ్ అలీఖాన్ బుధవారం అరెస్టు కావడం, అనంతరం బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. భారత సంతతికి చెందిన సౌతాఫ్రికన్ ఇక్భాల్ మీర్ శర్మపై దాడి చేసిన కేసులో ఐపిసి 325 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.

ఇక్భాల్ శర్మ కథనం ప్రకారం ....తాజ్ హోటల్ లో ఇక్బాల్ మీర్ శర్మ తన ఫ్యామిలితో కలసి మంగళవారం రాత్రి డిన్నర్‌కు వచ్చారు. వారి పక్కటేబుల్ లోనే సైఫ్ అలీఖాన్ మరియు అతని ప్రియురాలు కరీనాకపూర్, ఆమె అక్క కరిష్మా, అమృతా అరోరా, ఆమె భర్త షకీల్ లడక్, మలైకా అరోరాఖాన్, ప్రొడ్యూసర్ బిలాల్ అమ్రోహి, మరికొందరు స్నేహితులు కూర్చునిన ఉన్నారు. వార పార్టీ మూడ్‌లో గోలగోల చేస్తుండటంతో ఇక్బాల్ వారిని వారించాడు. గోల చేయకుండా పార్టీ చేసుకోవాలని సూచించాడు. దీంతో కోపం పెంచుకున్న సైఫ్ అలాంటప్పుడు ఇక్కడికెందుకు వచ్చారు లైబ్రరీకి వెళ్లాలని సూచించాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాదన మొదలైంది. సైప్ అతన్ని ఇడియట్ అని దూషించడంతో పాటు ముఖంపై పంచ్ ఇచ్చాడు. శర్మ మామను కూడా తోసేశాడు. దీంతో అక్కడి నుంచి తన ఫ్యామిలీతో వెళ్లి పోయిన శర్మ హాస్పటల్ కి వెళ్లి చికిత్స చేయించుకుని ఫోలీసులకు ఫిర్యాదు చేశారు. 

సైప్ కథనం ప్రకారం....
ముందు వారే నాపై దాడి చేశారు. మా బృందంలోని ఆడవారిని అసభ్య పదజాలంతో దూషించారు. హోటల్ లోని సిసిటివి రికార్డులను పరిశీలించినా, హోటల్ సిబ్బందిని అడిగినా ఈ విషయం తేలుతుంది. న్యాయం నా వైపునే ఉంది. చట్టానికి లోబడి పోలీస్ స్టేషన్ కు వచ్చి వివరణ ఇచ్చి బెయిల్ తీసుకున్నాను అంటూ చెప్పారు.