14 ఫిబ్ర, 2012

నయనతార ప్లాస్టిక్ సర్జరీ-ప్రభు టాటూ కోసమే..?

నయనతార, ప్రభుదేవా ప్రేమాయణం బయట ప్రపంచానికి ఎలా తెలిసిందో తెలుసా...? నయనత చేతిపై వేయించుకున్న ప్రభు అనే పచ్చబొట్టు కారణంగానే. ఆ పచ్చబొట్టు మీడియా కంట పడటంతో....తీగలాగితే డొంకంతా కదిలి వీరి ప్రేమ వ్యవహారం బట్టబయలైంది. అనంతరం ప్రభుదేవా తన భార్య రమలత్‌కు విడాకులు ఇవ్వడం, నయనతార-ప్రభుదేవా పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. 

తాజాగా ఇద్దరి మధ్య బంధం తెగింది. ప్రభుదేవా నయనను మోసం చేశాడంటూ ఆమె కుటుంబ సభ్యులు మీడియాకు వెళ్లడించడమే ఇందుకు నిదర్శనం. ప్రభుదేవాతో ప్రేమ వ్యవహారాన్ని మరిచి పోవడానికి నయనతార మళ్లీ సినిమాలపై దృష్టి మళ్లించింది. 

అంతే కాకుండా ప్రభుదేవాకు సంబంధించిన గుర్తులు తన వద్ద ఏమీ ఉండకుండా అన్ని బయట పడేసిందట. తన చేతిపై ఉన్న ప్రభు పచ్చబొట్టును కూడా తుడిచేసుకోవాలని నిర్ణయించుకుందని, ఇందుకోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోబోతోందని చెన్నయ్ సమాచారం.