16 ఫిబ్ర, 2012

షోయబ్ అక్తర్‌తో నటి మీరా అఫైర్

కరాచీ: ఎప్పుడూ వివాదాలతో వార్తల్లోకి వచ్చే పాకిస్దాన్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ఇప్పుడు మరోసారి కొత్త వివాదంతో వార్తల్లో ముఖ్య వ్యక్తిగా నిలిచారు. ఐతే ఈ కొత్త వివాదం ఏమిటంటే నటి మీరాతో షోయబ్ గత సంవత్సర కాలంగా వ్యవహారం కలిగి ఉన్నాడనే వార్త ఇప్పుడు హాల్ చల్ చేస్తుంది. 

ఈ సందర్బంలో నటి మీరా జియో న్యూస్ ఛానల్‌తో మాట్లాడుతూ మా ఇద్దరి మద్య ఉన్న సంబంధం చాలా తీవ్రమైనది.. అతని కోసం గత సంవత్సర కాలంగా నేను వేచి చూస్తున్నాను. నేను అతనితో నిజాయితీగా కట్టుబడి ఉన్నప్పటికీ, అతను మాత్రం నన్ను అభినందించ లేదు. రెండు సంవత్సరాల క్రితం మేమిద్దరం కలవడం జరిగింది. ఐతే షోయబ్ ఎప్పుడైతే నాతో పాటు, నా కజిన్‌కు కూడా ప్రపోజ్ చేశాడో ఆరోజు నుండి అతనితో ఉన్న అన్ని సంబంధాలు కూడా తెంచుకున్నానని అన్నారు. నిజంగా ఇది నాకు ఓ జోక్ లాగా అనిపించింది. 

ఇక నటి మీరా గురించి తెలుసుకుంటే ప్రచార పోరాటాలకు పెట్టింది పేరు. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ మహేష్ భట్ రూపొందించిన కొన్ని సినిమాలలో మీరా నటించారు. 2011 ప్రపంచ కప్ సమయంలో హటాత్తుగా రిటైర్ ప్రకటించిన షోయబ్... ప్రస్తుతం పాకిస్తాన్-ఇంగ్లాండ్ సిరీస్ కోసం ఒక చానెల్‌తో నిపుణుడుగా పనిచేస్తున్నారు. ఈ విషయంపై షోయబ్‌ని స్పందించమనగా అసలు మీరా దేని గురించి మాట్లాడుతుందో నాకు తెలియడం లేదని అన్నారు. మీరా చేస్తున్నఆరోపణలను త్రోసిపుచ్చారు. 

మీరాతో నేను ఎప్పుడూ ఎఫైర్ నడపలేదన్నాడు. నేను క్రికెట్ ఆడే సందర్బంలో అమ్మాయిల వైపు చూసి నవ్వినంత మాత్రాన లవ్ చేసినట్లు అనుకుంటే పోరపాటని అన్నాడు. ఏది ఐతేనేం ఇటీవల పాకిస్దాన్ క్రికెటర్స్‌లలో రోమాంటిక్ రిలేషన్ షిప్ పెట్టుకున్న వారిలో షోయబ్ రెండో వ్యక్తి. అంతక ముందు నిషేధానికి గురైన పాకిస్దాన్ ఫేసర్ మహామ్మద్ ఆసిఫ్.. వీణా మాలిక్‌తో రోమాంటిక్ రిలేషన్ ఉన్న విషయం తెలిసిందే.