22 ఫిబ్ర, 2012

రామ్ చరణ్‌కు రాజమౌళి ‘ఈగ’ షాక్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో ‘రచ్చ’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఎన్వీ ప్రసాద్, పరాస్ జైన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చివరి దశకు చేరుకున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ నెలలో ఇతర పెద్ద సినిమాలు ఏవీ లేవని ధైర్యంగా ఉన్న రామ్ చరణ్‌కు రాజమౌళి ఈగ రూపంలో షాక్ తగిలింది. 

నాని, సమంత, సుదీప్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో గ్రాఫిక్స్ ప్రధానంగా రూపొందుతున్న ఈగ చిత్రాన్ని కూడా ఏప్రిల్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అదే జరిగితే ‘రచ్చ’ సినిమాకు భారీగా పోటీ తప్పదని, ముఖ్యంగా రాజమౌళి మార్కు సినిమా కాబట్టి రామ్ చరణ్ ‘రచ్చ’ సినిమా కంటే కూడా ‘ఈగ’ సినిమాపైనే జనాలకు ఎక్కువ ఆసక్తి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ చిత్రం కూడా దాదాపుగా ఈ రెండు చిత్రాలకు దగ్గరగానే విడుదలవుతోంది. మరి ఏం జరుగబోతోందో..? మరో నెల రోజులు ఆగితే గానీ తెలియదు.