16 ఫిబ్ర, 2012

హీరోను బట్టి రేటు ఫిక్స్ చేస్తానంటున్న త్రిష!!

వస్తువును బట్టి బట్టి రేటు అన్నట్టుగానే.. తాను హీరోను బట్ట రేటును ఫిక్స్ చేస్తానని నటి త్రిష అంటోంది. ఇటీవల వెండితెరకు చాలా గ్యాప్‌ ఇచ్చిన త్రిష... తెలుగులో వెంకటేష్‌తో రెండుసార్లు నటించింది. అయితే, కోలీవుడ్‌లో నటించడానికి మాత్రం కథానాయకుడిని బట్టి రేటు ఫిక్స్‌చేస్తుందట. 

"రంగం" అనే చిత్రంలో మంచి గుర్తింపు పొంది. 'స్నేహితులు'లో మంచి నటుడుగా పేరు తెచ్చుకున్న హీరో ఆర్‌.బి.చౌదరి కుమారుడు జీవా. ఈ మధ్య తాను నటించే తాజా చిత్రంలో తన సరసన జోడీగా నటించేందుకు త్రిషను సంప్రదించారు. అప్పటివరకు తీసుకున్న రేటుకంటే పెంచేసి పారితోషికాన్ని చెప్పింది. దీంతో వారు ఆశ్చర్యపడి... కొన్ని సినిమాల్లో రేటు తగ్గించుకుని చేస్తున్నట్టు ఉదహరించారు. 

అవి హీరో స్టామినా, బేనర్‌ను దృష్టిలో ఉంచుకుని చేశాననీ, జీవాతో చేయాలంటే.. ఇంతే ఇవ్వాలని కరాఖండిగా తేల్చి చెప్పేసిందట. చేసేదిలేక.. అలాగే అని వెళ్ళిపోయిన ఆ నిర్మాత... ఆమెకు ఆ రేటుతో సినిమాను చేస్తే... రెండు బాషల్లో చేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ.. ఈ విషయం తెలిసిన తర్వాత జీవా కాస్త వెనకడుగువేసినట్లు సమాచారం... మరి జీవా కూడా ఓ స్టేటస్‌ ఉన్న నటుడే కదా.