17 ఫిబ్ర, 2012

ఊర్వశి శర్మను పెళ్లాడిన పొట్టి హీరో సచిన్

మౌనమేలనోయి, పండు సినిమాల ద్వారా గతంలో తెలుగులో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సచిన్ జోషి ఈ మధ్య ‘అజం’ అనే సినిమా ద్వారా బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తండ్రి పేరు మోసిన బిజినెస్ మ్యాన్ కావడంతో తన సినిమాలు ప్లాపయినా సరే...తన సొంత డబ్బులతో హీరోగా వెలుగొందుతూనే ఉన్నాడు. ఇప్పడు ఈ హీరో గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏమొచ్చిదంటే... సచిన్ జోషి ఇటీవల వాలంటైన్స్ డే సందర్భంగా మోడల్, నటి ఊర్వశి శర్మను పెళ్లాడాడు. పెళ్లి ఎవరికీ తెలియకుండా చేసుకున్న ఈ పొట్టి హీరో మార్చిన 2న తన స్నేహితులకు, బాలీవుడ్ సెలబ్రిటీలకు, ఇతర సన్నిహితలకు ముంబైలో గ్రాండ్ గా రిసెప్షన్ పార్టీ ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నాడట. ఈ వేడుకకు బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ సెలబ్రిటీలు కూడా హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

ఈ మధ్య బాలీవుడ్ లో వరుసగా వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవలే జెనీలియా-రితేష్ దేశ్ ముఖ్ వివాహం చేసుకోగా, ఇదే సంవత్సరం కరీనా-సైఫ్ అలీఖాన్ కూడా ఏకం కాబోతున్నారు. మరికొందరు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఇదే సంవత్సరం పెళ్లికి సిద్దం అవుతున్నారు.