17 ఫిబ్ర, 2012

షాకిచ్చే రేటుకు'రచ్చ'ఆడియో రైట్స్

రామ్ చరణ్ తాజా చిత్రం 'రచ్చ'ప్రతీ విషయంలో ఏదో ఒక సంచలనానికి తెర తీస్తోంది. తాజాగా ఈ చిత్రం ఆడియో రైట్స్ భారీ మొత్తానికి అమ్మి రికార్డు క్రియేట్ చేసింది. ఆదిత్యా మ్యూజిక్ వారు ఈ భారీ మొత్తాన్ని చెల్లించి తీసుకున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని ఓ పాట ఇప్పటికే నెట్ లో లీక్ అయ్యి సంచలనం క్రియేట్ చేస్తోంది. ఇక ఈ చిత్రం ఆడియో విడుదల హైదరాబాద్ లో చేయటం లేదు. ఈ పంక్షన్ ని గ్రాండ్ గా అభిమానుల సమక్షంలో .. కర్నూలులో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మొదట వారు తిరుపతిలో ఆడియో విడుదల అనుకున్నారు కానీ అక్కడ రామ్ చరణ్ వివాహ రిసెప్షన్ పెట్టుకోవటంతో ఇలా మార్పు చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 26న ఆడియో విడుదల చేస్తారు. అలాగే ఈ చిత్రాన్ని మార్చిలో విడుదలకు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ఇప్పటికే ఒక పాటను నెట్ లో లీక్ చేసారు. ఆ పాట అందరి అభిమానాన్ని చూరగొంటోంది. మణిశర్మ స్వరపరిచన ఈ సాంగ్ సినిమా హైలెట్స్ లో ఒకటిగా చెప్తున్నారు. ఈ సాంగ్ ఇలా సాగుతుంది..."సైలెంట్ చూపులోడు...వైలెంట్ చేతలోడు ...కరెంట్ కండలోడు..హీ ఈజ్ ద మిస్టర్ తీస్ మార్ ఖాన్ ... రచ్చ... అడుగేస్తే సీడెడ్..ఆంధ్రా..నైజాం..రచ్చ...వీడు రెచ్చిపోతే ఖచ్చితంగా రచ్చ..హీఈజ్ గోయింగ్ టుబి ఎ మెగాస్టార్...హీఈజ్ గోయింగ్ టు బి ఎ గెగా స్టార్.. హీ ఈజ్ గోయింగ్ టు బి ఎ యుగా స్టార్..అంటూ మాస్ బీట్ తో ఈ సాంగ్" సాగుతుంది. మాస్ మసాలా, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని పరాస్ జైన్, ఎన్.వి.ప్రసాద్ మెగా సూపర్ గుడ్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.