25 ఫిబ్ర, 2012

యడ్యూరప్పకు బీజపీ అధిష్టానం షాక్‌

పార్టీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిలా తయారైన కర్నాటక మాజీ సిఎం యడ్యూరప్పను నిరభ్యంతరంగా పార్టీ నుంచి వెళ్లవచ్చని బిజెపి చీఫ్ నితిన్ గడ్కారీ తెగేసి చెప్పారని తెలుస్తోంది. నిన్న బెంగళూరులో జరిగిన చింతన్ బైఠక్ లో యడ్యూరప్పతో ముఖా ముఖి భేటీయైన గడ్కారీ ఆయనకు సూటిగా మనసులో మాటను చెప్పారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో యడ్యూరప్ప షాక్ తిన్నారని సమాచారం. 

నిష్కళుంకుడిగా బైటపడితే తప్ప మళ్లీ పదవీ యోగం దక్కదని నితిన్ గడ్కారీ స్పష్టం చేశారని బెంగళూరులో ప్రచారం హోరెత్తుతోంది. మరో వైపు ఈనెల 27 లోగా తనకు ఏదో ఒక కీలక పదవి కట్టబెట్టాలని మాజీ సిఎం పార్టీ హైకమాండ్ కు గడువు విధించారు. అదే రోజున జన్మదినం పేరుతో తన మద్దతుదారులతో యడ్యూరప్ప బలప్రదర్శనకు దిగనున్నారు.