27 ఫిబ్ర, 2012

బ్రహ్మానందంపై పోలీస్ కంప్లైంట్?

ప్రముఖ కమిడియన్ బ్రహ్మానందంపై పోలీస్ కంప్లైంట్ ఒకటి నమోదు కాబోయి చివరి నిముషంలో ఆగిన సంఘటన ఒకటి ఫిల్మ్ సర్కిల్సో లో వినపడుతోంది. అక్కడ వినపడే దాని ప్రకారం రీసెంట్ గా బ్రహ్మానందం రాజమండ్రి వెళ్లటం సంభవించింది. అక్కడ మధురపూడి ఎయిర్ పోర్ట్ లో ఓ వ్యక్తి బ్రహ్మానందం ని సెల్ కెమెరాతో తీయటానికి ప్రయత్నించాడు. అభిమానంతో అతను చేసే పనికి కోపం తెచ్చుకున్న బ్రహ్మి అతని చెంప చెళ్లు మనిపించాడు. దాంతో అతను సీరియస్ అయ్యి ఎయిర్ పోర్ట్ అదారిటి వాళ్ళ దగ్గరకి వెళ్లి కంప్లైంట్ చేయబోతే వాళ్లు పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని సజెస్టు చేసారు.

దాంతో అతను టౌన్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి అక్కడ కంప్లైంట్ చేయబోయారు. అప్పుడు పోలీసులు ...గొడవని పెద్దది చేయటం ఎందుకు రాజీ కి రండి అని చెప్పటం జరిగింది. అంతేగాక ఈ విషయాలని ఎయిర్ పోర్ట్ లో ఉన్న సెక్యూరిటీ ఫరిధిలోనే సెటిల్ చేసుకోవాలని సూచించారు. ఆ కుర్రాడు పట్టుదలగా ఎయిర్ పోర్ట్ లో కేసు ఫైల్ చేద్దామని ప్రయత్నించాడు. అయితే అక్కడ లోకల్ గా ఉన్నవాళ్లు కలగ చేసుకుని వారించారు. అంతేగాక బ్రహ్మానందం చేత అతని సారి చెప్పించారు. లేకపోతే ఆ కేసు పెద్దదై మీడియాకు ఎక్కేదని చెప్పుకుంటున్నారు. అదృష్టవశాత్తు ఎయిర్ పోర్ట్ కు మీడియాకు దూరంగా ఉండటంతో ఈ వార్త బయిటకు పొక్కి అల్లరి కాలదేని సమాచారం.

1 వ్యాఖ్య:

అజ్ఞాత చెప్పారు...

వెల్డన్ బ్రెమ్మీ