20 ఫిబ్ర, 2012

కొడుకు పెళ్లి రిసెప్షన్‌కు పరీక్ష సెంటర్ మార్చిన మంత్రి

శ్రీకాకుళం: తన కుమారుడి పెళ్లి రిసెప్షన్ కోసం పరీక్ష కేంద్రాన్ని మార్పించిన మంత్రి ఉదంతం వెలుగులోకి వచ్చింది. తన కుమారుడు రవి మనోహర్ నాయుడు వివాహానంతర విందు కోసం రోడ్లు, భవనాల శాఖ మంత్రి శ్రీకాకుళంలోని ఓ పాఠశాల నుంచి పరీక్ష కేంద్రాన్ని మార్పించారు. అకస్మాత్తుగా, ముందస్తు సమాచారం ఇవ్వకుండా పరీక్షా కేంద్రాన్ని మార్చడంతో అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు. దీంతో ఓ విద్యార్థి ప్రమాదానికి గురైనట్లు కూడా వార్తలు వచ్చాయి.


మంత్రిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ భారత ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఇఎఎస్ శర్మ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు. అయితే, ఆ సంఘటన పెద్దగా ప్రచారంలోకి రాలేదు. ఎస్ఎఫ్ఐ విద్యార్థులు శ్రీకాకుళంలో ర్యాలీ నిర్వహించారు. హన్స్ ఇండియా ఆంగ్ల పత్రికలో వార్త రావడంతో అది బయటి ప్రపంచానికి కొంత మేర తెలియవచ్చింది. ఆదివారంనాడు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ నియామకం కోసం నిర్వహించిన పరీక్ష విషయంలో మంత్రి ఉదంతం చోటు చేసుకుంది.