15 ఫిబ్ర, 2012

ఆరోగ్యంగానే ఉన్నానంటూ త్రిష వివరణ

నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను... అయితే కెనడా హాస్పటిల్ కి వెళ్లాలనుకుంది..ఆరోగ్య సమస్యలతో కాదు..శరీరంపై మరో టట్టూ వేయించుకోవటానికి అంది త్రిష. ఆమె తన శరీరంపై ఉన్న టట్టూలను ఎరేజ్ చేయించుకోవాలనుకుంటోందని,అవి ఎలర్జీ వచ్చాయని,అందుకే కెనడాలోని ఓ హాస్పటిల్ ని సంప్రదించిందని వార్తలు వచ్చాయి. వాటిపై వివరణ ఇస్తూ ఆమె ఇలా స్పందించింది. అలాగే తను మరిన్ని టట్టూలనూ తన శరీరంపై వేయించుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది. 

అయితే దమ్ము చిత్రం పూర్తయ్యాక ఆ పని చేస్తానని చెప్పింది. ఎందుకంటే టట్టూ వేయించుకోవటానకి మూడు నుంచి నాలుగు గంటలు సమయం పడుతుందని,అంతేకాక ఆ టట్టూ వేయించుకునేటప్పుడు చాలా బాధాకరంగా ఉండి...వేయించుకున్నాక రెస్ట్ తీసుకోవాలనిపిస్తుందని తెలిపింది. త్వరలో దమ్ము షూటింగ్ నిమిత్తం ఎబ్రాడ్ వెళ్తున్నట్లు తెలిపింది. ఇక తన పాత్ర దమ్ము సినిమాలో హైలెట్ అవుతుందని చెప్పుకొచ్చింది. ఆమె ఈ విషయమై మాట్లాడుతూ...నేను ఎన్టీఆర్ తో ఇంతకుముందు రెండు మూడు సార్లు చేయాల్సి వచ్చింది కానీ అవి మెటీరియలైజ్ కాలేదు. ఎన్టీఆర్ తో పనిచేయటం చాలా హ్యాపీగా ఉంది. అలాగే బోయపాటి శ్రీను తో కూడా. ఇక ఈ చిత్రం నా పాత్ర.. మూడు రకాలుగా విభిన్నంగా సాగుతుంది. అందులో ఒకటి నేను రెగ్యులర్ గా చేసేది అంది త్రిష. త్రిష రీసెంట్ గా వెంకటేష్ సరసన నటించిన బాడీగార్డ్ చిత్రం మంచి టాక్ తెచ్చుకున్నా తర్వాత కలెక్షన్స్ పరంగా డ్రాప్ అయ్యిపోయింది.