15 ఫిబ్ర, 2012

సంజయ్ నా పట్ల అలా ప్రవర్తించలేదు: అమీషా

కురచ దుస్తులతో అందాలన్నీ బయటకు కనిపించేలా ఎక్స్ ఫోజింగ్ చేస్తూ ఓ ఫంక్షన్ కు హాజరైన అమీషా పటేల్ పై సంజయ్ దత్ ఆగ్రహం వ్యక్తం చేశాడని, దుప్పట్టా కప్పుకుని కవర్ చేసుకోవడం లేదా వేరే మంచి డ్రెస్ వేసుకోవాలని సూచించాడని గతంలో వార్తలు వచ్చాయి. సినిమాల సంగతి పక్కన పెడితే....వ్యక్తి గత జీవితంలో సంజయ్ సంప్రదాయం ఉండటానికి ఇష్ట పడతాడని, కుటుంబ సమేతంగా జరిగే వేడుకకు అమీషా అశ్లీలంగా కనిపించే దుస్తులతో హాజరు కావడంతో చూసి తట్టుకోలేయాడని, తన భార్య ద్వారా అమీషాకు చురకలంటించాడని వార్తలు వినిపించాయి. 

అయితే....ఈ వార్తలను అమీషా పటేల్ కొట్టి పారేసింది. సంజయ్ నాతో ఎప్పుడూ అలా ప్రవర్తించలేదని, నాకు మంచి శ్రేయోభిలాషి, నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటారు. సంజయ్ వైఫ్ మాన్యత కూడా నన్ను ఎంతో అభిమానిస్తుంది. ఎవరో కావాలని ఇలాంటి చీప్ రూమర్స్ పుట్టిస్తున్నారు అని మండి పడుతోంది. 

అమీషా ప్రస్తుతం రన్ బోలా రన్, షార్ట్ కట్ రోమియో, భయ్యాజీ సూపర్ హిట్, సేమ్ టు సేమ్ అనే హిందీ చిత్రాల్లో నటిస్తోంది. కెరీర్లో చెప్పుకోదగ్గ హిట్ సినిమాలు ఏమీ లేక పోవడంతో 2007 తర్వాత అమీషాకు అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. దీంతో గెస్ట్ పాత్రలు, చిన్న పాత్రలకు పరిమితమైన ఆమె కొంత కాలం సినిమాలకు దూరంగా ఉంది. మళ్లీ 2011 నుంచి మళ్లీ వెండి తెరపై మెరుస్తోంది. ఈ సంవత్సరం అత్యధికంగా ఆమె చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి.