14 ఫిబ్ర, 2012

ఎలాంటి బైకైనా ఆమె ముందు బలాదూర్‌

150 సీసీ, 180 సీసీ బైకులు నడపాలంటే చాలా మంది యువకులే వెనకడుగు వేస్తారు. కానీ కరీంనగర్‌ జిల్లా సుల్తానాబాద్‌కు చెందిన సంజన ముందు ఈ బైకులన్నీ బలాదూరే. నాలుగో తరగతి చదివే సంజన... ఇలాంటి బైకులను నడపడమే కాదు.. ఏకంగా విన్యాసాలు చేస్తూ అందరినీ అబ్బుర పరుస్తోంది. బైక్‌ రైడింగ్‌తో పాటు.. యోగా , స్విమ్మింగ్‌లోనూ సంజన ప్రతిభ చూపుతోంది.