18 ఫిబ్ర, 2012

షారుఖ్ ఖాన్‌తో రీ ఎంట్రీ ఇస్తున్న ఐశ్వర్య రాయ్

‘బేటి బి’కి జన్మనిచ్చిన తర్వాత ఐశ్వర్యరాయ్ సినిమాలకు దూరం అయిన సంగతి తెలిసిందే. అయినా సరే త్వరలోనే మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడానికి ఇప్పటికే ప్రయత్నాలు మొదలయ్యాయి కూడా. అయితే ఎవరి సినిమా ద్వారా ఆమె సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తుంది? సెకండ్ ఇన్సింగ్స్ లో ఆమెతో నటించే తొలి హీరో ఎవరు? తదితర అంశాలు ఇప్పుడు బాలీవుడ్ లో చర్చనీయాంశం అయ్యాయి. తొలుత శ్రీరామ్ రాఘవన్‘హ్యాపీ బర్త్ డే’ అనే సినిమాల ద్వారా ఎంట్రీ ఇవ్వబోతోందని ప్రచారం జరుగుతున్నప్పటికీ....సంజయ్ లీలా బన్సాలీ రూపొందిస్తున్న ‘బాజీరావు మస్తానీ’ సినిమాలో షారుఖ్ ఖాన్‌తో కలిసి ఎంట్రీ ఇవ్వబోతోందిన మరో ప్రచారం కూడా ఉంది. 

ఎవరి వాదన ఎలా ఉన్నా...అందాల ఐశ్వర్యరాయ్ రీఎంట్రీపై అభిమానులు ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ఆ అందాన్ని తెరపై కన్నులారా చూడాలని ఆశ పడుతున్నారు. ఐశ్వర్య కూడా అభిమానుల ఆకాంక్షకు తగిన విధంగా కథలను ఎంపిక చేసుకునే పనిలో ఉంది. తల్లినైనా సరే తనలో అందం, అభినయం తగ్గలేదని నిరూపించుకోవడానికి తహతహలాడుతోంది. 

అయితే తరచూ ఐశ్వర్య ఎంట్రీపై మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆమె సినిమాల్లోకి రావడానికి చాలా సమయం ఉన్పప్పటికీ....తన ఫేయిత్ తగ్గకూడదనే ఉద్దేశ్యంతో ఓ ప్రైవేట్ పబ్లిసిటీ ఏజెన్సీ ద్వారా తన ఎంట్రీపై వార్తలు, పుకార్లు పుట్టిస్తూ జనం తనను మరిచపోకుండా ఉండటానికే ఇలా చేయిస్తుందనే వాదన కూడా ఉంది.