27 ఫిబ్ర, 2012

భాను ప్రియ కారు సీజ్.. షాక్


సీనియర్ ఆర్టిస్టు భానుప్రియ కారుని రీసెంట్ గా ఆర్టీవో అధికారులు సీజ్ చేసి ఆమెను రెంట్ కారులో హోటల్ కి వెనక్కి పంపారు. దాంతో ఆమె ఊహించని సంఘటనకి షాక్ కు గురైంది. ఆ తర్వాత ఆమె మండిపడింది. తమిళనాడులోని పొల్లాచ్చి సమీపంలో ఈ సంఘటనజరిగింది. సంఘటన వివరాల్లోకి వెళితే..పొల్లాచి,అన్నామలై పరిశర ప్రాంతాలలోని టూరిస్ట్ ఆపరేటర్స్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఈ సీజ్ చేయటం జరిగింది. చాలా కాలంగా టూరిస్ట్ ఆపరేటర్స్ అక్కడ కారులని సినిమా వాళ్లకు అద్దెకిస్తూ జివితం సాగిస్తున్నారు. అయితే సినిమావాళ్లు అనగానే చాలా ఎక్కువ డబ్బులు పిండుతూండటంతో వాళ్ల దగ్గర కార్లు అద్దెకి తీసుకోవటానికి ఎవరూ ఆసక్తి చూపటం లేదు. 

అంతేగాక అక్కడ లోకల్ జనం వద్ద నుంచి కార్లు నామినల్ రేటులకు తీసుకుని పని గడుపుకుంటున్నారు. ఈ నేపధ్యంలో వారంతా ఆర్టీవో అధికారలకు ఓ పిటీషన్ ఇచ్చారు. అంతేకాక తమ కారులని అద్దెకు తీసుకోకుండా తమ లైవ్ లీ హుడ్ కి దెబ్బ కొడుతున్నారని వారు ఆరోపించారు. ఆ పిటీషన్ తీసుకున్న ఆర్టివో అధికారులు వెంటనే ఏక్షన్ లోకి దిగి అలా లోకల్ జనం వద్ద నుంచి రెంట్ కి తీసుకున్న కారులను సీజ్ చేయటం ప్రారంభించారు. ఈ నేపధ్యంలో భానుప్రియ కారు కూడా సీజ్ చేయటం జరిగింది. 

ఈ విషయమై భానుప్రియ స్పందిస్తూ..ఈ దేశంలో మాకు కావాల్సిన వారి వద్ద నుంచి మేము వెహికల్స్ రెంట్ కి తీసుకునే హక్కు లేదా..ఇది చాలా దారణమైన విషయం. పోనీ సొంత కార్లు వేసుకుని షూటింగ్ కి వద్దామంటే పార్కింగ్ ఫీజు క్రింద చాలా ఎక్కువ వసూలు చేస్తున్నారు. పోని రెంట్ కు తీసుకుంటే సీజ్ చేస్తున్నారు అని కోపంతో మండిపడ్డారు. ఇక భానుప్రియ ప్రస్తుతం ఎన్టీఆర్ కు తల్లిగా దమ్ము చిత్రంలో చేస్తున్నారు.