23 ఫిబ్ర, 2012

అబద్దాలకోరంటూ హీరోయిన్ పై స్టార్ డైరక్టర్

ఆమె అబద్దాలాడుతోంది..అస్సలు ఆమెను నేను కలవనే లేదు...అలాంటిది ఆమెను నా సినిమాలో తీసుకున్నానా..అంతా అబద్దం అంటూ అసిన్ పై మీడియా వద్ద మండిపడ్డాడు బాలీవుడ్ స్టార్ డైరక్టర్ రోహిత్ శెట్టి. తను త్వరలో షారూఖ్ ఖాన్ తో చేయబోయే చిత్రం చెన్నై ఎక్సప్రెస్ లో అసిన్ ని తీసుకోలేదని చెప్పుకొచ్చాడు. రీసెంట్ గా అసిన్ ఓ ఇంటర్వూలో తాను షారూఖ్ సరసన చెన్నై ఎక్సప్రెస్ చిత్రంలో చేస్తున్నానని చెప్పుకొచ్చింది. దానిపై ప్రతిస్పందనగా రోహిత్ శెట్టి ఇలా చెప్పుకొచ్చాడు. 

అంతేగాక తాను ఇప్పుడు బోల్ బచ్చన్ బోల్ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నానని అన్నాడు. తను హీరోయిన్ గా కత్రినాకైఫ్ ని,దీపికా పదుకోనిని తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలిపాడు. ఇక ఈ స్టేట్మెంట్ తో అసిన్ పరిస్ధితి అయోమయంలో పడింది. తన మేనేజర్ చెప్పిన మాటలుతో ఆమె పొరపాటున ఇలా నోరు జారింది. ఇప్పుడు దాన్ని అవహేళనగా రోహిత్ శెట్టి మాట్లాడాడు. గతంలో రోహిత్ శెట్టి సినిమాకు ఆమెను హీరోయిన్ గా అడిగాడు. అయ్యితే ఆమె డేట్స్ ఇవ్వలేనని నిక్కచ్చిగా చెప్పింది. అది మనస్సులో పెట్టుకునే ఇలా రోహిత్ శెట్టి తీవ్రంగా ఫైర్ అయ్యి ఆమె ను అవమానించాడని అంటున్నారు.