22 ఫిబ్ర, 2012

అనుష్క లోకల్ డామినేషన్ నడుస్తుందా?

ప్రభాస్ హీరోగా రూపొందిన డార్లింగ్ అప్పట్లో విడుదలై మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నటించిన కాజల్‌కు మంచి మార్కులే పడ్డాయి. ప్రభాస్ ఫిజిక్ కు తగిన జోడీగా పేరు తెచ్చుకుంది. తాజాగా డార్లింగ్ చిత్రం కన్నడంలో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. యం.డి శ్రీధర్ దర్శకత్వంలో దర్శన్ హీరోగా ఈ చిత్రాన్ని రూపొందించే ప్రయత్నంలో ఉన్నారు. 

అయితే...ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై దర్శక నిర్మాతలు మల్ల గుల్లాలు పడుతున్నారు. కత్తిలాంటి అందాలతో అదరగొడుతున్న కాజల్ ను తీసుకుందామా? లేక బెంగుళూరు లోకల్ భామ అనుష్కను తీసుకుందామా? అనే దానిపై ఆలోచిస్తున్నారు. త్వరలోనే ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఖరారు కానున్నారు.

బిజినెస్ మేన్ హిట్‌తో మంచి జోష్ మీద ఉన్న అనుష్క ప్రస్తుతం తమిళంలో సూర్య హీరోగా రూపొందుతున్న మాత్రన్ సినిమాతో పాటు, మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ హీరోగా రూపొందుతున్న తుపాకి చిత్రంలో నటిస్తోంది. పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రంలోనూ కాజల్ ఎంపికైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అనుష్క నాగ్ సరసన ఢమరుకం సినిమాతో పాటు, ప్రభాస్ హీరోగా రూపొందుతున్న వారధి చిత్రంలో, మరో నాలుగు తమిళ చిత్రాల్లో నటిస్తోంది.