24 ఫిబ్ర, 2012

రెండో పెళ్లి వాడని తెలిసినా పెళ్లికి రెడీ అంటోంది

ఆ మధ్యన జర్నీ హీరోయిన్ అనన్య పెళ్లి విషయంలో మోస పోయిందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కరెక్టుగా వివాహ సమయానికి అతను ఆల్రెడీ మ్యారీడ్ అని,మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడని బయిట పడింది. అయినా సరే అతనంటే ప్రేమ అని,అతన్నే పెళ్లి చేసుకుంటానని మీడియాకు తెలియచేసింది అనన్య. ఆమె ఈ విషయమై మీడియాతో మాట్లాడుతూ... ఆంజనేయులే నా భర్త. ఎవరు కాదన్నా ఆయన్నే పెళ్లి చేసుకుంటాను. అతను మొదటి వివాహం గురించి నాకు తెలుసు. మా వివాహ విషయమై మీడియాలో అసత్య ప్రచారం జరుగుతోంది. ఈ రూమర్స్ వల్ల మా మధ్య అనుబంధం పెరుగుతుందే తప్ప మరేమీ కాదు అంది. ఇక తల్లిదండ్రులు వద్దన్నా ఆయన్నే పెళ్లి చేసుకుంటానని చెబుతోంది. ఆంజనేయులుపై తన తండ్రి పెట్టిన కేసును ఉపసంహరించుకునేలా కూడా చేసింది. కేరళకు చెందిన ఈ భామ తమిళంలో నాడోడిగళ్, శీడన్, ఎంగేయుమ్ ఎప్పోదుమ్ తదితర చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. ఈ బ్యూటీ కేరళకు చెందిన ఆంజనేయులు అనే వ్యాపారవేత్తతో ప్రేమలో పడింది. పెద్దల అనుమతితో ఇటీవల వివాహ నిశ్చితార్థం కూడా జరిగింది. పెళ్లి వేదిక కూడా నిర్ణయం అయింది. ఆ తరువాతే ఆంజనేయులు అసలు బండారం బయటపడింది. అయితే తమ ప్రేమ ముందు అవన్నీ చిన్న విషయాలంటూ అనన్య అనటంతో అంతా తెల్ల మొహం వేస్తున్నారు.

1 వ్యాఖ్య:

అజ్ఞాత చెప్పారు...

I really appreciate you Ananya. Go ahead