28 ఫిబ్ర, 2012

నాకు థైరాయిడ్ ప్లాబ్లం వచ్చింది: నాగార్జున

నాకు కొంతకాలం క్రిందట థైరాయిడ్ సమస్య వచ్చింది. అయితే నేను మొదట డిటెక్టు చెయ్యలేకపోయాను. నేను బాగానే ఫిట్ గా ఉన్నాను..బాగున్నాను కదా అనుకున్ాను. కానీ తరుచుగా టైర్ అయిపోవటంతో చెక్ చేయించితే తేలింది. ధైరాయిడ్ సమస్య అనేది కాన్సర్ అంత సీరియస్ ప్లాబ్లం కాదు. అయితే ఇక్కడ నేను చెప్పేదేమిటంటే ఏ సమస్యని అయినా ప్రారంభదశలో కనుక్కుంటే క్యూర్ చేసుకోవటం ఈజీ అని.. అంటూ నాగార్జున తన స్వీయ అనుభవాలతో కాన్సర్ పై అవగాహన ఉండాలనే విషయం చెప్పారు. ఆయన కాన్సర్ అవగాహనా ప్రచారంలో పాల్గొంటున్నారు. 

ఇక ప్రస్తుతం తన తాజా చిత్రం ‘షిరిడి సాయి’షూటింగ్ లో బిజిగా ఉన్నారు. నాగార్జున షిరిడి సాయి బాబా పాత్రలో ‘షిరిడి సాయి’లో కీ రోల్ చేస్తున్నారు.. ఈచిత్రాన్ని జులై నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జూన్ నెలలో ఆడియో విడుదల చేసి అనంతరం నెల రోజుల గ్యాప్‌లో విడుదల చేసేందు ప్లాన్ చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రం ప్రస్తుతం కర్నాటకలో షూటింగ్ జరుపుకుంటోంది. మార్చిన 12వరకు ఇక్కడే షూటింగ్ జరుపుకోనుంది. అనంతరం అన్నపూర్ణ స్టూడియోలో ప్రత్యేకంగా 7 ఎకరాల్లో వేసిన మసీదు సెట్ లో షూటింగ్ జరుపనున్నారు. మరో ప్రక్క శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఢమురకం చిత్రం చేస్తున్నారు.