21 ఫిబ్ర, 2012

చిరు సినీ టైటిలే.. ఐశ్వర్యా రాయ్ కూతురు పేరు?

అమితాబ్ బచ్చన్ తన మనవరాలు పేరుని అభిలాష గా పెట్టనున్నారని సమాచారం. ఈ విషయమై ప్రముఖ రచయిత్రీ శోభాడే చేసిన ట్వీట్ అంతటా హాట్ గా మారింది. శోభాడే ట్వీట్ లో...బేటి బి కి అభిలాష అనే పేరు పెడుతున్నారా..ఆ పేరు చాలా బాగుంది. అభి,ఐష్ లకు శుభాకాంక్షలు..ఈ పేరు అనేది నిజమైతే చాలా ఇన్సిప్రేషన్ గా ఉంది అంది. దాంతో శోభాడే వంటి వ్యక్తి చేసిన ట్వీట్ కావటంతో అంతటా ప్రాచుర్యం పొందుతోంది. అయితే ఈ పేరుపై అమితాబ్ కుటుంబం ఖండనా లేదు..ఖరారు చేస్తున్నట్లు వార్తాలేదు. 

ఇక చిరంజీవి కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన చిత్రం అభిలాష. ఆ చిత్రం టైటిల్ నే యాదృచ్చికంగా పెట్టబోవటం జరుగుతోంది. ఇక నవంబర్ 17న ఐశ్వర్యారాయ్ ఈ ముద్దుల పాపాయికి జన్మని ఇచ్చింది. ముంబైలోని సెవన్ హిల్స్ హాస్పటిల్ లో డెలివరీ జరిగింది. మరో ప్రక్క ‘‘మా బేబీకి ఒక మంచి పేరు దొరికిందని, త్వరలోనే దాన్ని వెల్లడిస్తామని’’ అభిషేక్ బచ్చన్ వెల్లడించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అమితాబ్ తిరిగి ఇంటికి చేరాక బేటిబి ఫోటోలు, పేరు బయటకు వెల్లడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.