13 ఫిబ్ర, 2012

భార్యామణితో సినిమా ప్లాన్ చేస్తున్న యువ హీరో?

జెనీలియా, రితేష్ దేశ్ ముఖ్ ఇటీవల పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి కాకముందు ఇద్దరు ఓ సినిమాలో నటించడం ద్వారా పరిచయం అయ్యారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం పెరిగి, ఆపై ప్రేమకు దారి తీయడంతో ఇద్దరి మధ్య ఎఫైర్ రగులుకుంది. ఆరేళ్ల పాటు గుట్టుగా సాగిన ఈ జంట వ్యవహారం పెళ్లి కార్యక్రమంతో ఓ కొలిక్కి వచ్చింది. 

తాజాగా బాలీవుడ్ నుంచి వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ జంట ‘మస్తి 2’ పేరుతో రూపొందబోయే స్వీక్వెల్ లో నటిస్తున్నారని సమాచారం. 2004లో వచ్చిన మస్తి సినిమాలో ఈ ఇద్దరు కలిసి నటించారు. అప్పుడు వీరికి ఇంకా పెళ్లి కాలేదు. తాజాగా భార్య భర్తలు అయిన తర్వాత అదే సీక్వెల్‌లో నటిస్తున్నారనే విషయం బయటకు పొక్కడంతో సర్వత్రా చర్చీనీయాంశం అయింది. 

మస్తి సినిమాను రూపొందించిన ఇంద్రకుమార్, అశోక్ టకేరియాలే ఈ సీక్వెల్‌ను కూడా రూపొందిస్తున్నారని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. భార్యామణితో కలిసి నటించాలని కోరికతో రితేష్ చాలా ఆతృతగా ఉన్నాడని బాలీవుడ్‌తో చర్చించుకుంటున్నారు.